ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cm Kcr Vs Governor Tamilisai: గవర్నర్ వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

ABN, First Publish Date - 2022-09-09T02:00:18+05:30

గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) కామెంట్స్పై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై ట్విటర్లో తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్ (CM KCR), తెలంగాణ సర్కార్ను అపఖ్యాతి పాలు చేయడానికి.. తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారంతో ప్రజల మన్నన పొందలేమని బీజేపీ గ్రహించిందని, ఆ నేపథ్యంలోనే గవర్నర్ నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. 


తన మూడేళ్ల పదవీకాలంలో తెలంగాణ ప్రభుత్వంపై తమిళిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కాలంలో ఆమెకు జరిగిన అవమానాలను ఏకరువు పెట్టారు. ప్రోటోకాల్ ఇతర విషయాల్లో తనకు ఎలాంటి ప్రధాన్యత ఇవ్వలేదని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌, ప్రగతిభవన్ మధ్య పెరుగుతున్న గ్యాప్‌పై ఒకింత అసహనానికి గురవుతున్నారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, తన పరిధి ఏంటో తెలుసని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన మనోధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని తమిళిసై చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-09-09T02:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising