ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‎ను కలిసిన స్టార్ హీరో

ABN, First Publish Date - 2022-05-19T01:46:17+05:30

సీఎం కేసీఆర్‎ను తమిళ హీరో (Hero) విజయ్ (ViJay) కలిశారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన విజయ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‎ను తమిళ హీరో (Hero) విజయ్ (ViJay) కలిశారు. హైదరాబాద్ (Hyderabad) వచ్చిన విజయ్.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Kcr)ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్‌తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipally) కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ (Joginipally Santosh Kumar).. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్‌ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్‌ను కేసీఆర్ అప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 


ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు (Dilraju) నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలోనే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు. 


కాగా హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలోనూ విడుదలవుతున్నాయి. ‘అదిరింది’, ‘విజిల్’, ‘తుపాకీ’, ‘మాస్టర్’, ‘బీస్ట్’ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. హీరో విజయ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.




Updated Date - 2022-05-19T01:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising