ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంగ్లంపై అవగాహన కోసం విద్యాశాఖ ప్రత్యేక పాఠ్యాంశాలు

ABN, First Publish Date - 2022-03-14T22:28:59+05:30

తెలంగాణ విద్యార్థులు అంగ్లంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక తరహాలో పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక తరహాలో పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో శైలేష్ రెడ్డి సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు గంట చొప్పున 20 రోజులు ఈ పాఠ్యాంశాలు ప్రసారమౌతాయన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండే ఆంగ్ల బోధన ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించారని గుర్తు చేశారు. మార్చి 15వ తేదీ నుండి ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు  20 పని రోజుల్లో స్పెషల్ లెసన్స్ ప్రసారాలుంటాయన్నారు. 


వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ పాఠ్యాంశాల బోధన జరగనున్నందున ఆ మేరకు విద్యార్థులను సమాయత్తం చేయాలని రంగారెడ్డి విద్యాశాఖ నిర్ణయించిందని, పుస్తకం ఆధారంగా పాఠ్యాంశాల బోధన కాకుండా విద్యార్థులనే చిత్రాలుగా చూపిస్తూ బోధించే కొత్త పద్దతి ద్వార అంగ్లం బోధించనున్నారని శైలేష్ రెడ్డి వివరించారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి పి.సుశీంధ్రరావు ఆధ్వర్యంలో  అంగ్ల బోధన నిపుణడు ఎ.ఎస్.రెడ్డి బోధించే పాఠ్యాంశాలు మొదటి విడతలో 20 రోజుల పాటు రోజూ గంట చొప్పున వినూత్న పద్దతిలో బోధన ఉంటుందని సీఈవో తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాద్యాయులు పాఠ్యాంశాలను అనుసరిస్తే భవిష్యత్ లో మంచి ప్రయోజనాలుంటాయని సీఈవో శైలేష్ రెడ్డి గుర్తు చేశారు.

Updated Date - 2022-03-14T22:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising