చిన్నారి అనుమానాస్పద మృతి
ABN, First Publish Date - 2022-12-16T02:55:01+05:30
నార్కట్‌పల్లి, డిసెంబరు 15: అనుమానాస్పదస్థితిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. పాప ఒళ్లు, ముఖంపై గాయాలున్నాయని, పాపను తల్లే కొట్టిచంపిందని నాన్నమ్మ, తాత ఆరోపిస్తున్నారు. తల్లేమో ఫిట్స్‌తోనే తన బిడ్డ చనిపోయిందంటోంది. నల్లగొండ జిల్లా
తల్లే కొట్టి చంపింది: నాన్మమ్మ, తాతయ్య ఆరోపణ
ఫిట్స్‌తో చనిపోయిందంటున్న తల్లి
నార్కట్‌పల్లి, డిసెంబరు 15: అనుమానాస్పదస్థితిలో రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. పాప ఒళ్లు, ముఖంపై గాయాలున్నాయని, పాపను తల్లే కొట్టిచంపిందని నాన్నమ్మ, తాత ఆరోపిస్తున్నారు. తల్లేమో ఫిట్స్‌తోనే తన బిడ్డ చనిపోయిందంటోంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. ఎస్సై రామకృష్ణ వివరాలిలా ప్రకారం.. చిట్యాల మండలం ఎలికట్టెకి చెందిన ఉయ్యాల రమ్యకు శివరాం (4), ప్రియాంశిక (2) పిల్లలు. ఆమె భర్త, లారీడ్రైవర్‌గా పనిచేసే వెంకన్న రెండేళ్ల క్రితం కరోనాతో మృతిచెందాడు. భర్త చనిపోయాక రమ్య అదే గ్రామానికి చెందిన పెరిక వెంకన్నతో కలిసి నాలుగు నెలలుగా సహజీవనం చేస్తోంది. ఇద్దరూ పిల్లలతో కలిసి నార్కట్‌పల్లిలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి ప్రియాంశికకు ఫిట్స్ వచ్చిందని చెబుతూ చికిత్సకోసం పెరిక వెంకన్నతో కలిసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స జరుగుతుండగానే ప్రియాంశిక చనిపోయింది. పాప మృతి చెందిన విషయాన్ని ఎలికట్టెలో ఉండే అత్తమామలు చంద్రకళ, యాదయ్యలకు ఫోన్ ద్వారా తెలిపింది. వారు గురువారం ఉదయం వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. వారికి చిన్నారి ప్రియాంశిక గదవ, చెంపలపై గాయాలు కనిపించాయి. తన మనవరాలిని రమ్య, పెరిక వెంకన్నలే చంపి ఫిట్స్‌తో చనిపోయిందని కట్టుకథ అల్లుతున్నారని వారు ఆరోపించారు. ప్రియాంశిక తాత యాదయ్య ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Updated Date - 2022-12-16T02:55:03+05:30 IST