ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Suryapet: పోలీసులు బైక్‌ తీసుకెళ్లారని..

ABN, First Publish Date - 2022-12-16T02:29:05+05:30

ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారన్న కోపంతో వారి పెట్రోలింగ్‌ వాహనాన్ని తీసుకెళ్లిపోయాడో యువకుడు! మానసిక స్థితి సరిగా లేని ఆ వ్యక్తి పోలీసులకు కొద్దిసేపు కంగారు పుట్టించాడు! ఈ ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారి వాహనాన్నే ఎత్తుకెళ్లాడు!

పత్రాలు లేవని బండిని స్టేషన్‌కు తరలించడంతో ఆగ్రహం

పోలీసుల పెట్రోలింగ్‌ వాహనాన్ని చోరీ చేసిన యువకుడు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన

సూర్యాపేటక్రైం, డిసెంబరు 15: ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తరలించారన్న కోపంతో వారి పెట్రోలింగ్‌ వాహనాన్ని తీసుకెళ్లిపోయాడో యువకుడు! మానసిక స్థితి సరిగా లేని ఆ వ్యక్తి పోలీసులకు కొద్దిసేపు కంగారు పుట్టించాడు! ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన ముల్కలపల్లి అశోక్‌(23) ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. కొద్దికాలంగా అతని మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడిన తల్లిదండ్రులు.. కుమారుడిని మానసిక ఆస్పత్రికి పంపించేందుకు ఇటీవల మునగాల పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అశోక్‌ బుధవారం అర్ధరాత్రి తర్వాత తన ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వచ్చాడు. స్థానిక జనగాం క్రాస్‌ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో పోలీసులు ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పలేదు. అతని వద్ద పత్రాలు లేకపోవడంతో బైక్‌ను స్టేషన్‌కు తరలించారు. పోలీసులపై కోపంతో ఉన్న అశోక్‌ కొత్త బస్‌స్టేషన్‌ వద్ద నిలిపి ఉన్న పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాన్ని చూశాడు. తాళాలు కూడా ఉండడంతో దాన్ని కోదాడ వైపు తీసుకెళ్లాడు. 40 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కోదాడ శివారులో డీజిల్‌ అయిపోయి వాహనం ఆగిపోయింది. దాంతో అశోక్‌ వాహనాన్ని వదిలేసి వెళ్లిపోయాడు.

గురువారం తెల్లవారుజామున 5.16కు వాహనాన్ని తీసుకువెళ్లగా ఉదయం 8.20 గంటలకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన టీఎ్‌స09పీఏ0658 నంబరు గల పెట్రోలింగ్‌ వాహనంలో శ్రీనివాస్‌, అజీమొద్దీన్‌ విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేటలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న ఏఎస్సై ఎం.శంకర్‌ గురువారం తెల్లవారుజామున కొత్త బస్‌స్టేషన్‌ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో నంబరు లేని కార్లు రెండు రావడంతో వాటికి జరిమానా విధించి, పోలీస్‌ స్టేషన్‌లో ఉంచాలని పెట్రోలింగ్‌ వాహనంలో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌, అజీమొద్దీన్‌ను ఆదేశించారు. వారు పెట్రోలింగ్‌ వాహనాన్ని కొత్త బస్‌స్టేషన్‌ ఎదుట నిలిపి, రెండు కార్లను స్టేషన్‌కు తీసుకెళ్లారు. గమనించిన అశోక్‌ పోలీసు వాహనాన్ని తీసుకెళ్లిపోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. జిల్లాలోని అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. సీసీ కెమెరాల్లో వాహనం కోదాడ వైపు వెళుతున్నట్లు గుర్తించి అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-12-16T10:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising