సుద్దాల అశోక్‌తేజకు సినారె సాహితీ పురస్కారం
ABN, First Publish Date - 2022-10-08T15:22:11+05:30
తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న గొప్ప సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి(Dr. C. Narayana Reddy) అని శాంతా
హైదరాబాద్/రవీంద్రభారతి: తెలుగు సాహిత్య చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న గొప్ప సాహితీవేత్త డా.సి.నారాయణరెడ్డి(Dr. C. Narayana Reddy) అని శాంతా బయోటెక్స్ అధినేత పద్మభూషణ్ కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యువకళావాహిని ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డుగ్రహీత డా.సి.నారాయణరెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ(Suddala Ashok Teja)కు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వరప్రసాద్‌రెడ్డి పురస్కారగ్రహీత సుద్దాలను సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాహిత్యంలో సినారె, సుద్దాల అశోక్‌తేజలు దిగ్గజాలని అన్నారు. పలువురు ప్రముఖులు సుద్దాల అశోక్‌తేజను సత్కరించి అభినందించారు.
Updated Date - 2022-10-08T15:22:11+05:30 IST