ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

ABN, First Publish Date - 2022-03-11T22:25:00+05:30

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సభ ముగిసేవరకు సస్పెన్షన్ ఎత్తివేయాలని కోర్టును బీజేపీ ఎమ్మెల్యేలు  కోరారు. అయితే సస్పెన్షన్‌పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. 


తెలంగాణ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే బీజేపీ ఎమ్మెల్యేలు ‘RRR’ (Etela Rajender, Rajasingh, Raghunandan rao)లకు ఊహించని షాక్ తగిలింది. ఈ ముగ్గురూ సమావేశాలు ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగానే ఆర్ధిక మంత్రి హరీష్ 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. కాగా హరీష్ రావు బడ్జెట్ ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. అంతేకాదు.. బడ్జెట్ కాపీలను చించేశారు. గవర్నర్ ప్రసంగం లేదంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.  దీంతో మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. తమ సస్పెన్షన్ ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఎమ్మెల్యేలు  ఆశ్రయించారు. 

Updated Date - 2022-03-11T22:25:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising