ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HCA: హెచ్‌సీఏకు శ్రీనివాస్‌గౌడ్ వార్నింగ్

ABN, First Publish Date - 2022-09-22T02:29:14+05:30

హైదరాబాద్ క్రికెట్ అసోషియేన్‌ (Hyderabad Cricket Association)కు క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) వార్నింగ్ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేన్‌ (Hyderabad Cricket Association)కు క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్ (Srinivas Goud) వార్నింగ్ ఇచ్చారు. టీ20 టికెట్ల గందరగోళంపై ఆయన స్పందించారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రతిష్టను దిగజార్చితే సహించేది లేదని హెచ్చరించారు. భారత్‌, ఆస్ట్రేలియా (India Australia) మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారిస్తామని తెలిపారు. టికెట్లు బ్లాక్‌లో అమ్మినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. HCA అనేది కేవలం 10 మంది పదవుల కోసమే కాదన్నారు. ఉప్పల్ స్టేడియానికి ప్రభుత్వం 23 ఎకరాలు ఇచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. 


ఈ నెల 25న ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ క్రికెట్‌ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ 20 మ్యాచ్‌ జరగనుంది. మ్యాచ్‌ టికెట్లు సికింద్రాబాద్‌ జింఖానా హెచ్‌సీఏ కార్యాలయంలో మంగళవారం నుంచి లభిస్తాయని సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నగరంతో పాటు, వివిధ జిల్లాల నుంచి క్రికెట్‌ అభిమానుల తెల్లవారు జాము నుంచే గ్రౌండ్‌ వద్ద బారులు తీరారు. సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. తాళాలు తీసే వరకు ఇక్కడే ఉంటాం.. టికెట్లు ఇస్తారా, లేదా అని క్రికెట్‌ అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం తాళాలు తీసేవరకు ఇక్కడే ఉంటామన్నారు. హెచ్‌సీఏకు, అజారుద్దీన్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్ల కోసం ఈ నెల 14 నుంచి తిరుగుతున్నామని, ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదని మండిపడ్డారు. 

Updated Date - 2022-09-22T02:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising