ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ABN, First Publish Date - 2022-06-27T21:50:31+05:30

దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్ నగర్: దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దక్కిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్టార్ లో ఉద్యోగాలకోసం వచ్చే నెల 3 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో 60 కంపెనీలతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 7 వ తరగతి.. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకు వివిధ హోదాలలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశం ఉందన్నారు. లక్షా ఎనభై వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయలు వార్షిక వేతనాలతో ఈ నియామకాలు జరుగుతాయన్నారు. తెలంగాణా వచ్చాకనే పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘనత మన సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. హన్వాడలో ఫుడ్ పార్క్ వస్తుందని, కానీ కొంత మంది భూ నిర్వాసితులను గొడవలకు పురి గొలిపే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేళా తర్వాత పోలేపల్లి సెజ్‌లో కూడా జాబ్ మేళా పెట్టి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలాగే చించొలి - భుత్పుర్ రోడ్ వల్ల అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. 

Updated Date - 2022-06-27T21:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising