ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Srilanka Crisis: రాష్ట్రాల అప్పులపై కేంద్రాన్ని తప్పుబట్టిన టీఆర్ఎస్

ABN, First Publish Date - 2022-07-20T03:17:14+05:30

శ్రీలంక (Srilanka) సంక్షోభంపై అఖిలపక్ష భేటీలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ప్రజెంటేషన్‌‎ను టీఆర్ఎస్ (Trs) తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శ్రీలంక (Srilanka) సంక్షోభంపై అఖిలపక్ష భేటీలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కేంద్రం ప్రజెంటేషన్‌‎ను టీఆర్ఎస్ (Trs) తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు (Mp K Kesawarao), లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు (Mp Nama Nageswara Rao) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం  చేసిన అప్పుల‎పై నిలదీశారు. తలసరి ఆదాయంలో దేశంలోనే రెండవ స్థానంలో తెలంగాణ (Telangana) ఉందని సమావేశంలో తెలిపారు. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అప్పులు గురించే మాట్లాడడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని  కే కేశవరావు, నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. 


ఇక కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీఆర్ఎస్‌తో పాటు విపక్ష పార్టీలు ఖండించాయి. సందర్భం లేకుండా రాష్ట్రాల అప్పులపై ప్రజెంటేషన్ ఏంటి అని నిలదీశాయి. తెలంగాణ జీఏస్డీపీలో 23% కంటే ఎక్కువ అప్పులు తీసుకుంటున్నారన్న వాదనను టీఆర్ఎస్ తోసిపుచింది. ఇదే కేంద్ర ప్రభుత్వం 59% పైగా అప్పులు తీసుకుందని..దీనికి జవాబు ఎవరు ఇస్తారని ఎంపీ కేశవరావు ప్రశ్నించారు. 


‘‘తెలంగాణ రాష్ట్ర అప్పులు కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఎఫ్‌ఆర్‌బీఎం 3.5% పరిధిలోనే ఉన్నాయి. కానీ కేంద్రప్రభుత్వం అప్పులు ఏకంగా 6.2% శాతాన్ని దాటాయి. తీసుకున్న అప్పులను చెల్లించడంలో తెలంగాణ నిర్లక్ష్యం చేసిందా?. కేంద్రం చేసిన అప్పులకు సమాధానం ఎవరు ఇస్తారు?. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చ జరగాలి.’’ అని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-07-20T03:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising