ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధాలకు బదులు విద్యకు ఖర్చు చేయాలి

ABN, First Publish Date - 2022-10-03T09:19:58+05:30

ప్రపంచంలోని వివిధ దేశాలు యుద్ధాలు, యుద్ధ సామగ్రి కోసం ఖర్చు చేసే డబ్బులను విద్య, వైద్యం కోసం వ్యయం చేయాలని, దాంతో ఆయా దేశాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ శాంతి సభలో కేఏ పాల్‌

సికింద్రాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచంలోని వివిధ దేశాలు యుద్ధాలు, యుద్ధ సామగ్రి కోసం ఖర్చు చేసే డబ్బులను విద్య, వైద్యం కోసం వ్యయం చేయాలని, దాంతో ఆయా దేశాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల అనేక మంది ప్రాణాలు పోతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాల వల్ల అనేక దేశాల ప్రజలు శాంతి లేకుండా జీవిస్తున్నారని తెలిపారు. కేఏ పాల్‌ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఆదివారం ప్రపంచ శాంతి సభను నిర్వహించారు. ప్రపంచంలో శాంతి లేకపోవడంతో జరిగిన అనేక దేశాల యుద్ధాల్లో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీ జయంతి రోజున శాంతి సభ కోసం తాను అనుమతి కోరితే రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వలేదని, చివరకు కోర్టు జోక్యంతో ఆలస్యంగా సభకు అనుమతిచ్చారని చెప్పారు. కోదండరాం మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోరుకున్న యేసునే శిలువ ఎక్కించారని, పూర్తిస్థాయిలో శాంతిని నెలకొల్పడం అంత ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. గద్దర్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని 25 శాతం అమలు చేస్తే శాంతి నెలకొనేదన్నారు. 

Updated Date - 2022-10-03T09:19:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising