ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానాకాలం సాగుకు నీటిని విడుదల చేసిన Speaker Pocharam

ABN, First Publish Date - 2022-06-26T01:49:38+05:30

వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు(nizam sagar project) నుండి శనివారం శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(speaker pocharam srinivas reddy) నీటిని విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు(nizam sagar project) నుండి శనివారం శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(speaker pocharam srinivas reddy) నీటిని విడుదల చేశారు.నిజాంసాగర్ మండలంలోని కెనాల్ హెడ్ రెగ్యులేటరీ నుండి స్విచ్ ఆన్ చేసి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 6.13 TMC ల నీరు నిల్వ ఉన్నదని తెలిపారు.ఈ వానాకాలంలో నిజాంసాగర్ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. జుక్కల్, బాన్సువాడ, బోదన్ నియోజకవర్గాల పరిదిలో ఆయకట్టు ఉన్నదని చెప్పారు.ఇప్పటికే రైతులు బోర్లు, బావుల క్రింద వరి నారు మళ్ళు పోసుకున్నారు. 


కాలువల ద్వారా వదిలిన నీరు నాట్లకు ఉపయోగపడుతుందన్నారు. మొత్తం 6 విడతలుగా నీరు విడుదల చేస్తామని పోచారం తెలిపారు.మొదటి విడతలో నీటిని 20 రోజులు వదులుతామన్నారు.వానాకాలం సాగుకు 9 TMC లు అవసరమని చెప్పారు. తక్కువ నిల్వలు ఉన్నకారణంగా నీటిని ప్రణాళికాబద్ధంగా విడుదల చేస్తామని తెలిపారు.వర్షాకాలం కాబట్టి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు.నీటి విడుదల, ఆయకట్టు అవసరాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తామన్నారు.అత్యవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ నుండి నీటిని తెచ్చుకుంటామని చెప్పారు.రైతులు నీటిని వృదా చేయవద్దని ఆయన సూచించారు.


అవసరమైన మేరకే నీటిని విడుదల చేయడానికి, నీటి వృధాను అరికట్టడానికి పర్యవేక్షణ కోసం డిస్ట్రిబ్యూటర్ల వారిగా కాపలా నియమిస్తున్నామన్నారు.ఈ విషయంలో ఇరిగేషన్ అధికారుల సాంకేతికత అవసరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, NDCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, మాజీ ZP చైర్మన్ దఫేదార్ రాజు, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, నాయకులు, సాగునీటి శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T01:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising