ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల నుంచి నూతన పెన్షన్లు మంజూరు:Speaker Pocharam

ABN, First Publish Date - 2022-06-12T00:24:42+05:30

వచ్చే నెల నుండే నూతన పెన్షన్లు మంజూరుచేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని శాసన సభ స్పీకర్(speaker) పోచారం శ్రీనివాస రెడ్డి(pocharam srinivas reddy)పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి జిల్లా: వచ్చే నెల నుండే నూతన పెన్షన్లు మంజూరుచేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని శాసన సభ స్పీకర్(speaker) పోచారం శ్రీనివాస రెడ్డి(pocharam srinivas reddy)పేర్కొన్నారు.కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గి నూతన పెన్షన్లు మంజూరు చేయడానికి ఆలస్యం అయిందన్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి రూ. 12000 కోట్ల పెన్షన్లు ఇస్తున్నారని అన్నారు.కాంగ్రేసు హయంలో 28 లక్షల మందికి రూ. 800 కోట్లు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని ఆయన గుర్తు చేశారు. శనివారం బాన్సువాడ మండలం దేశాయిపేట, నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామాలలో జరిగిన 5వ విడత పల్లె ప్రగతి(palle pragati) కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు అత్యధికంగా మంజూరు అయింది బాన్సువాడ నియేజకవర్గంలోనేనని చెప్పారు.


కొత్తగా మరిన్ని ఇళ్ళు మంజూరు అవుతాయని తెలిపారు.నియేజకవర్గంలోని ఇళ్ళు లేని ప్రతి పేదవారికి స్వంత ఇంటిని మంజూరు చేస్తామని అన్నారు.గతంలో సాగునీటి కోసం కష్టాలు పడేవాళ్ళం. ఇప్పుడు రాష్ట్రంలో అడగకుండానే నీళ్ళు ఇస్తున్నామని అన్నారు.రాష్ట్రంలో24 గంటల కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. వ్యవసాయంలో పంట పెట్టుబడి కోసం రైతుబంధు ఇస్తున్నారని తెలిపారు. పక్కన ఉన్న మహరాష్ట్రంలో ఏ పథకం లేదని గుర్తు చేశారు.


ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం మొండివైఖరి అవలంబిస్తున్నా రైతుల మేలు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పు తెచ్చి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. అలాగే మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, MLC కల్వకుంట్ల కవిత, MP బిబీ పాటిల్, జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, ZP చైర్మన్ దఫేదార్ శోభ రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-12T00:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising