ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోలార్‌ ప్యానల్స్‌ పెట్టాల్సిందే!

ABN, First Publish Date - 2022-12-16T02:21:13+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టిన కేంద్రం.. ఆ మేరకు కొత్త చట్టంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

100 కిలోవాట్ల లోడ్‌ దాటే భవనాలకు తప్పనిసరి

కర్బన ఉద్గారాలు తగ్గించే ఇంధనం వాడాలి

లేకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా

ఆ సొమ్ము చెల్లించకపోతే ఆస్తుల జప్తు!

రాష్ట్రాల్లో ఇంధన పొదుపు నిధి ఏర్పాటు చేయాలి

ఇంధన పొదుపు సవరణ చట్టానికి పార్లమెంటు ఓకే

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడంపై దృష్టి పెట్టిన కేంద్రం.. ఆ మేరకు కొత్త చట్టంలో నిబంధనలను చేర్చింది. ఇకపై కొత్తగా నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు తప్పనిసరిగా సౌర విద్యుత్తు వంటి కర్బన ఉద్గారాలు తగ్గించే ఇంధన వాడకాన్ని పెంచాల్సిందే. అంటే భారీ భవనాలపై సోలార్‌ పవర్‌ ప్యానళ్లు పెట్టుకోవాల్సిందే. కొత్తగా కట్టే అపార్ట్‌మెంట్లలో కనీసం 25 ఫ్లాట్లు ఉండి.. ఒక్కో ఫ్లాట్‌కు నాలుగు కిలోవాట్ల లోడు కలిగిన విద్యుత్తు కనెక్షన్‌ ఉంటే ఆ భవనం లోడు 100 కిలోవాట్లను దాటుతుంది. అంటే ఆ అపార్ట్‌మెంట్‌ ‘ఇంధన పొదుపు (సవరణ) చట్టం-2022’ పరిధిలోకి వస్తుంది. ఆ భవన నిర్మాణం అంతా ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ ఆధారంగా లేదా ఎనర్జీ కన్జర్వేషన్‌ అండ్‌ సస్టైనబుల్‌ బిల్డింగ్‌ కోడ్‌కు లోబడి చేపట్టాల్సి ఉంటుంది. ఆ భవనంలో తప్పనిసరిగా కర్బన ఉద్గారాలు తగ్గించే ఇంధన వాడకం పెంచాల్సిందే. లేకపోతే డిస్కమ్‌లు ప్రత్యేకంగా సరఫరా చేసే కర్బన ఉద్గారాలు విడుదల చేయని విద్యుత్తును కొనుగోలు చేయాలి. అలా కొని, డిస్కమ్‌లు లేదా కేంద్రం నోటిఫై చేసే ఏజెన్సీలతో ‘కార్బన్‌ క్రెడిట్‌ సర్టిఫికెట్‌’ పొందాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆ అపార్ట్‌మెంట్‌కు భారీగా జరిమానాలు విధించనున్నారు. ఈ మేరకు ఇంధన పొదుపు చట్టం-2001ను సవరిస్తూ ఇంధన పొదుపు (సవరణ) బిల్లు-2022ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ఇంధన పొదుపునకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 100 కిలోవాట్ల లోడు లేదా అంతకంటే ఎక్కువగా వాడే భవనాలే ఈ చట్టం పరిధిలోకి రానున్నాయి. లోడు విషయంలో 100 కిలోవాట్లు లేదాఆ డిమాండ్‌ను కొనసాగించడం లేదా 50 కిలోవాట్లకు కుదించే అధికారం రాష్ట్రానికి ఉండనుంది. బిల్లు చట్టరూపం దాల్చిన అనంతరం వెలువడే మార్గదర్శకాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఇదివరకు ఇంధన పొదుపునకు చర్యలు తీసుకోవాలనే సూచనలు మాత్రమే ఉండగా.. తాజా చట్టంలో కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఉల్లంఘిస్తే 10 లక్షలు జరిమానా..

ఇక సంప్రదాయ ఇంధన (థర్మల్‌) వినియోగం ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. లేదా బయోమాస్‌, ఇతర ఇంధన వినియోగం పెంచుకోవాలి. ఈ చట్టం అమలు కోసం ఇంధన పొదుపుపై విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రజలను జాగృతం చేయడానికి వీలుగా ‘రాష్ట్ర ఇంధన పొదుపు నిధి’ ఏర్పాటు చేయాలి. ఇంధన పొదుపు చట్టాన్ని పాటించని సంస్థల నుంచి వసూలు చేసే జరిమానాలను ఇందులో జమ చేయాల్సి ఉంటుంది. ఈ చట్టం పరిధిలోకి నివాస భవనాలే కాకుండా భారీ వాహనాలు, ఎలక్ట్రిక్‌ ఉపకరణాలు, నౌకలు రానున్నాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే వాటికి ఎనర్జీ ఆడిట్‌ చేయించాల్సి ఉంటుంది. చట్టాన్ని ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. దీన్ని చెల్లించక పోతే రోజుకు రూ.10 వేలు అపరాధ రుసుము వేయనున్నారు. అయినప్పటికీ చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం స్థిరచరాస్తులను జప్తు చేసే అధికారం ఉంటుంది.

Updated Date - 2022-12-16T02:21:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising