ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మధ్యయుగాన్ని గుర్తుకుతెస్తున్న చిన్న జీయర్‌ వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-01-19T09:35:51+05:30

చిన్న జీయర్‌ స్వామి వ్యాఖ్యలు మధ్యయుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాడ వెంకటరెడ్డి


హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): చిన్న జీయర్‌ స్వామి వ్యాఖ్యలు మధ్యయుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన, ఇటీవల చేసిన  ప్రవచనాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనేచేయాలని, మాంసాహారులు ఏ మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే వ్యవహరిస్తారని ఆయన చెబుతున్న మాటలు మధ్యయుగాన్ని గుర్తు తెస్తున్నాయన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విగ్రహానికి సంకుచిత భావాలతో ‘‘సమానత్వ ప్రతిమ’’ పేరు పెట్టడం విడ్డూరం అని చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న జీయర్‌ స్వామి ప్రవచనాలు బహుజనుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఇలాంటి వ్యక్తి తలపెట్టిన కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి హాజరు కావడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందని చాడ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-19T09:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising