ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షెకావత్‌ సార్‌.. మాటలు సరే.. చర్యల సంగతి చెప్పండి!

ABN, First Publish Date - 2022-08-19T08:27:01+05:30

బీజేపీ నేతల తీరు చూస్తుంటే ‘అరిచే కుక్క కరవదు’ అన్న సామెత గుర్తుకొస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళేశ్వరం అవినీతిపై ఏం చేస్తారు?

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌

హైదరాబాద్‌, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతల తీరు చూస్తుంటే ‘అరిచే కుక్క కరవదు’ అన్న సామెత గుర్తుకొస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు అవినీతి అంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ సర్కారు అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా అని నిలదీశారు. ‘మాటలు సరే. చర్యల సంగతి చెప్పండి షెకావత్‌ సార్‌’ అని రేవంత్‌రెడ్డి గురువారం ట్విటర్‌లో ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు కాంగ్రెసే ప్రత్యామ్నాయమని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడి ్డఅన్నారు. రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలూ లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. మునుగోడు నియోజకవర్గం ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ఓటర్‌ జాబితాలను రాజకీయ పార్టీలకు అందించాలని కోరారు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలయ్యే దాకా ఆగకుండా ఎన్నికల కోడ్‌ ను వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-08-19T08:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising