ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎస్‌ఐల ప్రిలిమినరీ పరీక్ష

ABN, First Publish Date - 2022-08-08T05:42:33+05:30

ప్రశాంతంగా ఎస్‌ఐల ప్రిలిమినరీ పరీక్ష

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

19,992 మంది అభ్యర్థుల హాజరు

 వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి

హనుమకొండ క్రైం, ఆగస్టు 7: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఐల ఎంపిక కోసం ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుం చి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కమిషనరేట్‌ పరిధిలోని హనుమకొండ, జనగామ, నర్సంపేట ప్రాం తాల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్ష హాల్‌లోకి పెన్‌, హాల్‌టికెట్‌ తప్ప ఎలాంటి వస్తువులు అనుమతించలేదు. ఒక గంట ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించారు. ముందుగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ సిస్టం ద్వారా పరీక్షించి హాల్‌లోకి అనుమతించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 21,550 మంది అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ చేయగా 19,992 మంది పరీక్షకు హాజరయ్యారు. వరంగల్‌ జిల్లాలో 9,223, హనుమకొండలో 8,689, జనగామ జిల్లాలో 2,080 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు. కమిషనరేట్‌ పరిధిలో 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రతీసారి మా దిరిగా ఈసారి అభ్యర్థుల సౌకర్యార్ధం పోలీసులు హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయలేదు.


 

Updated Date - 2022-08-08T05:42:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising