ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో నర్సుల కొరత: మంత్రి హరీశ్

ABN, First Publish Date - 2022-04-25T22:15:07+05:30

రాష్ట్రంలో నర్సుల కొరత భారీగా ఉంది.. ఇతర ప్రాంతాల నుంచి నర్సులు ఎక్కువగా వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట: రాష్ట్రంలో నర్సుల కొరత భారీగా ఉంది.. ఇతర ప్రాంతాల నుంచి నర్సులు ఎక్కువగా వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.సోమవారం పట్టణంలోని పాత ఎంసీహెచ్ భవనంలో నర్సింగ్ కళాశాల తరగతులను మంత్రి హరీశ్ ప్రారంభించారు. జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా వైద్య శాఖ నోడల్ VH అధికారి డా. కాశీనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ సునీతా‌రెడ్డి,  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలు నూటికి నూరు శాతం కలిగిన కోర్సు నర్సింగ్ కోర్సు అని చెప్పారు.

 నర్సింగ్ విద్యార్ధులకు డెడికేషన్, అంకితభావం ఉండాలని సూచించారు.రోగులకు నర్సుల ఆత్మీయ పలకరింపు సగం రోగాన్ని మాయం చేస్తుందన్నారు.కరోనా సమయంలో పేషేంట్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేరు.. వారివద్ద ఉన్నది స్టాఫ్ నర్సులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రమేనని చెప్పారు. సిద్దిపేట ప్రజలకు ఒక వైపు విద్య, మరోవైపు కేరింగ్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తెలంగాణలో ఒకప్పుడు కేవలం 5 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు రాష్ట్రానికి 33 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు.డాక్టర్లలో స్పెషలైజ్ ఉన్నట్లే స్టాఫ్ నర్సు ల్లోనూ స్పెషలైజ్ ఉంటది.. ఎక్కడికెళ్లినా అదే విభాగంలో పనిచేస్తారని చెప్పారు.బాగా చదువుకోవడమే కాదు, సేవాభావాన్ని అలవర్చుకోవాలి.. పోటీ పడి సేవ చేయాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-25T22:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising