ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిగా బాలికపై లైంగిక దాడి

ABN, First Publish Date - 2022-07-01T09:04:46+05:30

తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆరోగ్యం సరిగా లేక మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్ను మూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బాధితురాలు ఎనిమిది నెలల గర్భవతి.. 
  • పనికి తీసుకువెళ్లి తాపీ మేస్త్రీ అఘాయిత్యం


రాజాపేట, జూన్‌ 30 : తండ్రి అనారోగ్యంతో మంచం పట్టాడు. ఆరోగ్యం సరిగా లేక మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి కన్ను మూసింది. దీంతో ఆ బాలిక కుటుంబ పోషణ భారాన్ని నెత్తిన ఎత్తుకుంది. రోజు కూలీగా మారి ఓ మేస్త్రీ వద్ద తాపీ పనికి వెళుతోంది. ఈ క్రమంలో ఆమెపై కన్నేసిన కీచకుడు.. బాలికను బెదిరించి ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం బాలికకు ఎనిమిదో నెలగా గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఈ దారుణం జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. మూడేళ్ల క్రితం తల్లి మృతిచెందగా, తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తండ్రి, చెల్లెలిని పోషించేందుకు ఆ బాలిక.. మేస్త్రీ చింతిగారి నర్సింహులు(35)తో రెండేళ్లుగా తాపీ పనికి వెళుతోంది. ఈ క్రమంలో పని ప్రదేశంలో ఆమెను బెదిరించి నర్సింహులు ఏడాదిగా లైంగిక దాడి చేస్తున్నాడు. శరీరంలో మార్పులను గుర్తించిన కుటుంబసభ్యులు బాలికను నిలదీశారు. దీంతో ఆమె 8 నెలల గర్భవతి అని తెలిసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-07-01T09:04:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising