గడ్డిమోపు రూ.170
ABN, First Publish Date - 2022-07-22T16:42:20+05:30
గోదావరి వరదలతో కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. మణుగూరు, దుమ్ముగూడెం, పినపాక
గోదావరి వరదలతో కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. మణుగూరు, దుమ్ముగూడెం, పినపాక తదితర మండలాల్లో పశువులకు గ్రాసం కొరత ఏర్పడింది. పాడి రైతుల ఇళ్లల్లో నిల్వ ఉంచిన గడ్డి వాములు వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని నీట మునిగి మురిగి పోయాయి. దీంతో పాడి రైతులు పశుగ్రాసం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీరు పారి మైదానాల్లో బురదమేటలు వేయడంతో కనీసం పచ్చిగడ్డి కూడా లభ్యంకాని దుస్థితి నెలకొంది. దీంతో పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. పశుగ్రాసం కొరతతో వరిగడ్డి ధరలు ఆమాంతం పెరిగాయి. గతంలో రూ.60నుంచి రూ.70వరకు ఉండే వరిగడ్డి మోపు ధరను రూ.150 నుంచి రూ.170కి అమ్ముతున్నారు. పశువుల దాణా ధరలకూ రెక్కలొచ్చాయి. దాణా బస్తా 25కేజీలకు రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.900లకు ధర పెరగింది.
Updated Date - 2022-07-22T16:42:20+05:30 IST