ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెషన్‌ మొత్తం సస్పెన్షన్‌.. నాలుగోసారి!

ABN, First Publish Date - 2022-03-08T08:15:45+05:30

బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిపై ఈ బడ్జెట్‌ సెషన్‌ మొత్తానికి సస్పెన్షన్‌ వేటు పడింది. సభ్యులు ఇలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిపై ఈ బడ్జెట్‌ సెషన్‌ మొత్తానికి సస్పెన్షన్‌ వేటు పడింది. సభ్యులు ఇలా.. ఓ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ అవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదు. ఇప్పటివరకు మొత్తం మూడు సార్లు ఈ పరిస్థితి ఏర్పడింది. తొలిసారిగా 2017లో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఆందోళన చేశారని అప్పటి టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యను స్పీకర్‌.. సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు. అలాగే అదే ఏడాది గిరిజనులు, బీసీలకు రిజర్వేషన్‌ పెంపు బిల్లుపై చర్చ సందర్భంగా సభ కు ఆటంకం కలిగించారన్న కారణంతో.. నాడు సభ లో ఉన్న మొత్తం ఐదుగురు బీజేపీఎమ్మెల్యేలపైనా సెషన్‌ వేటు పడింది. మళ్లీ 2018లో ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు అడ్డుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన హెడ్‌సెట్‌ను గవర్నర్‌ వైపునకు విసరడంతో.. అది పక్కనే ఉన్న మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కన్నుకు తగిలింది. ఈ ఘటనలో వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ను శాసనసభ నుంచి బహిష్కరించగా.. మరో 11 మంది కాంగ్రె స్‌ ఎమ్మెల్యేలను సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేశారు. 

Updated Date - 2022-03-08T08:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising