ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వర్‌ డౌన్‌.. అందని పెన్షన్‌ !

ABN, First Publish Date - 2022-08-10T10:16:47+05:30

అసలే ఆలస్యం.. ఆపై సాంకేతిక లోపం.. దీంతో ఆసరా పింఛను సొమ్ము నేటికీ చేతికి రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు జిల్లాల్లో ఫించనుదారుల అవస్థలు

హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అసలే ఆలస్యం.. ఆపై సాంకేతిక లోపం.. దీంతో ఆసరా పింఛను సొమ్ము నేటికీ చేతికి రాక వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారు. జూన్‌ పింఛను జూలై 5న రావాల్సి ఉండగా చివరి వారంలో ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తరుణంలో పలు జిల్లాల్లో బ్యాంకింగ్‌ కస్టమర్‌ సర్వీసు పాయింట్ల (సీఎ్‌సపీ)లో ఆధార్‌ ఎనేబుల్డ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) సర్వర్‌ మొరాయిస్తుండటంతో ఆ లబిఽ్ధదారులు బ్యాంకు ఖాతాల నుంచి పింఛను సొమ్ము పొందలేకపోతున్నారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు చేయగా, పట్టణ ప్రాంతాల్లోని వారికి ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఏటీఎం కార్డుల్లేని వారంతా సర్వర్‌ సమస్యతో సీఎ్‌సపీల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్నారు. కాగా, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, జనగాం, ఇతర జిల్లాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ సమస్య తలెత్తిందని బ్యాంకింగ్‌ అధికారులు చెబుతున్నారు. కొన్ని చోట్ల సాంకేతిక లోపాన్ని సవరించారని మిగతా చోట్ల కూడా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-08-10T10:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising