ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరినే ఛాపర్‌లో పంపడం శిక్షణలో భాగమే: ఫ్లై టెక్ ఏవియేషన్ మమత

ABN, First Publish Date - 2022-02-26T23:51:56+05:30

ఒక్కరినే ఛాపర్‌లో పంపడం శిక్షణలో భాగమేనని ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్ సీఈవో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ఒక్కరినే ఛాపర్‌లో పంపడం శిక్షణలో భాగమేనని ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్ సీఈవో మమత అన్నారు. జిల్లాలో జరిగిన ఛాపర్‌ ప్రమాదంపై ఆమె స్పందించారు. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్‌లో మృతి చెందిన ట్రైనీ పైలెట్ మహిమ నాగార్జున సాగర్‌లోని విజయపురి సౌత్‌లోని ఫ్లై టెక్ ఏవియేషన్ సెంటర్‌లో పైలెట్‌గా శిక్షణ తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఈరోజు 10.25కి ఛాపర్‌ టేక్ ఆఫ్ అయ్యిందని, 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ సెంటర్లో మహిమ శిక్షణ పొందుతుందని ఆమె పేర్కొన్నారు. పైలెట్‌గా పర్ఫెక్ట్ అయ్యాకే ఒంటరిగా పంపిస్తామని ఆమె తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఆమె అన్నారు.


జిల్లాలో శిక్షణ విమానం కూలిన సంగతి తెలిసిందే.  ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది.. ప్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందిన విమానంగా గుర్తించారు. ట్రైనింగ్ విమానం మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో తమిళనాడుకు చెందిన ట్రైనీ పైలెట్ ఉన్నారు. దట్టమైన పొగతో ఈ ట్రైనీ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు అధికారులు ధృవీకరించారు. 

Updated Date - 2022-02-26T23:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising