ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ

ABN, First Publish Date - 2022-05-15T08:42:57+05:30

సుంకిశాల ప్రాజెక్టు భూనిర్వాసిత రైతులు ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్‌కు శనివారం ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లెక్సీలతో ‘సుంకిశాల’ నిర్వాసితుల నిరసన 

పెద్దవూర, తిరుమలగిరి(సాగర్‌), మే 14: సుంకిశాల ప్రాజెక్టు భూనిర్వాసిత రైతులు ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన ఐటీ మంత్రి కేటీఆర్‌కు శనివారం ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుకొని స్టేషన్లకు తరలించారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రమావత్‌ బాసునాయక్‌ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ మహానగరానికి నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌తో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 1994లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సుంకిశాలలో శంకుస్థాపన చేశారని, అప్పట్లో పనులను అడ్డగించి ధర్నాకు దిగితే మంత్రులు, అధికారులు తమకు పలు దఫాల్లో హామీ ఇచ్చారని తెలిపారు. వాటిని నెరవేర్చాలని కోరారు.  ప్రస్తుతం ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన క్రమంలో భూము లు కోల్పోతున్న రైతులు తమకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పనులను నిర్వహించాలని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనకు దిగారు. ఫ్లెక్సీలు పెట్టగానే అరె్‌స్టలు చేయించడం అన్యాయమని వాపోయా రు. ఇప్పటికైనా హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2022-05-15T08:42:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising