ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Secundrabad రైల్వేస్టేషన్‌లో పూర్తిస్థాయిలో పట్టాలెక్కని రైళ్లు

ABN, First Publish Date - 2022-06-18T14:00:14+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్లు ఇంకా పూర్తిస్థాయిలో పట్టాలెక్కలేదు. ఇవాళ మధ్యాహ్నం నుంచి యధావిధిగా రైళ్లు నడిచే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు, ట్రాక్‌ను రైల్వే అధికారులు చెకింగ్ చేస్తున్నారు. స్టేషన్‌లో ధ్వంసమైన సామాగ్రి తొలగించి ట్రాక్ క్లియర్ చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేసేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. రూట్ క్లియరెన్స్ అయ్యే వరకు ఈరోజు, రేపు నగరంలో ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు నిలిపివేశారు. 


కాగా.. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ నిన్న వేలాది మంది ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనలు చేశారు. రైల్వేస్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ, రైళ్లకు నిప్పు పెట్టి పూర్తిగా ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఆందోళనల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా, కొన్నింటిని దారి మళ్లించింది. 

Updated Date - 2022-06-18T14:00:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising