ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంతటి విధ్వంసం ఇదే తొలిసారి..!

ABN, First Publish Date - 2022-06-18T08:33:09+05:30

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చరిత్రలోనే శుక్రవారం నాటి విధ్వంసం ఓ ‘బ్లాక్‌డే’గా నిలిచిపోనుంది. ఇంతటి ఖ్యాతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ చరిత్రలోనే శుక్రవారం నాటి విధ్వంసం ఓ ‘బ్లాక్‌డే’గా నిలిచిపోనుంది. ఇంతటి ఖ్యాతి గడించిన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ‘అగ్నిపథ్‌’ ఆందోళనకారులు సుమారు 10 గంటల పాటు తమ అధీనంలోకి తెచ్చుకుని, విధ్వంసకాండకు పాల్పడడం చరిత్రలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. నిజాం కాలంలో.. వేతనాల పెంపు డిమాండ్‌తో ఉద్యోగుల ఆందోళ(1927), భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు.. రైతాంగ పోరాటాలు, క్విట్‌ ఇండియా పోరాటం(1942), నిజాం వ్యతిరేక పోరాటం(1947), సాయుధ పోరాటం(1948).. రజాకార్లకు వ్యతిరేకంగా ఆందోళనలు, ఆంధ్రాలో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన ఆత్మగౌరవ ఉద్యమం(1952), విశాఖ ఉక్కు పోరాటం(1966) జరిగినా.. ఏనాడూ ఉద్యమకారులు రైల్వే ఆస్తుల జోలికి వెళ్లలేదని చరిత్ర అధ్యయనకారులు చెబుతున్నారు. అప్పటి యువజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతా్‌పరెడ్డి కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. విశాఖ ఉక్కు పోరాట సమయంలో సికింద్రాబాద్‌ తదితర రైల్వేస్టేషన్లలో ఉద్యమకారులు రాళ్లు రువ్వి, రైల్‌రోకో చేసిన దాఖలాలు మాత్రమే ఉన్నాయన్నారు. 

Updated Date - 2022-06-18T08:33:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising