ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మా కుమారుడితో 10 నిమిషాలు మాట్లాడనివ్వండి.. ’

ABN, First Publish Date - 2022-06-23T01:07:11+05:30

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పలువురు నిందితులను పోలీసులు గుర్తించారు. పృథ్వీరాజ్ అనే యువకుడు రైల్వే ఆస్తులు, బోగీలకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ (Hyderabad): సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ (Railway Station) విధ్వంసం కేసులో పలువురు నిందితులను పోలీసులు గుర్తించారు. పృథ్వీరాజ్ (Prithviraj) అనే యువకుడు రైల్వే ఆస్తులు, బోగీలకు నిప్పు పెట్టాడు. విధ్వంసం వీడియోలను గ్రూపుల్లో షేర్ చేశాడు. పృథ్వీని టాస్క్ ఫోర్స్ పోలీసులు (Task Force Police) అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 


అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో తమ కుమారుడు ఉన్నట్లు తెలియదని పృథ్వీరాజ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. మీడియాలో వచ్చిన కథనాలతో తమ కుమారుడు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించమన్నారు. హైదరాబాద్‎కి వస్తే ఎవరు కూడా తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. గుంటూరులోని సాయి డిఫెన్స్ అకడామీలో పృథ్వారాజ్ నాలుగేళ్లు క్రితం కోచింగ్ చేసుకున్నాడని చెప్పారు.  ఆర్మీ ఉద్యోగం కోసం చాలా ఏళ్ల నుంచి కష్టపడవుతున్నాడని పేర్కొన్నారు. తమ కుమారుడు ఇలా చేస్తాడని ఊహించలేదన్నారు.  తమ కుమారుడితో 10 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. శనివారం నుంచి పృథ్వీరాజ్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉందన్నారు.  ‘‘అసలు ఇంత విధ్వంసం జరిగిందనేది కూడా తెలియదు. సాయి డిఫెన్స్ అకాడమీ వారే మా కుమారుడు తీసుకెళ్లి ఉంటారు. మాకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.’’ అని పృథ్వీరాజ్ తల్లిదండ్రులు అన్నారు. 




Updated Date - 2022-06-23T01:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising