మంత్రుల జీతాలు పెంచారు! విద్యార్థుల స్కాలర్‌షి్‌పలు ఎందుకు పెంచరు?
ABN, First Publish Date - 2022-12-07T03:44:42+05:30
పెరిగిన ధరలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌షి్‌పలు ఎందుకు పెంచడంలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ప్రశ్నించారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
దేవరకొండ, డిసెంబరు 6: పెరిగిన ధరలకు అనుగుణంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెంచిన ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌షి్‌పలు ఎందుకు పెంచడంలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ ప్రశ్నించారు. బీసీ విద్యార్థి, యువజనుల పోరుయాత్ర మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 60 శాతం జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. మూడున్నరేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న 5.40లక్షల మంది బీసీలు రుణాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టి బీసీలకు రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సీటీలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సీటీలకు విచ్చలవిడిగా అనుమతులు ఇస్తూ, పేదలను విద్యకు దూపం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలు ఐక్య పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాలన్నారు. బీసీ విద్యార్థి యువజనుల పోరుయాత్ర జనవరి 8వ తేదీ వరకు కొనసాగుతుందని శ్రీనివా్‌సగౌడ్ తెలిపారు.
Updated Date - 2022-12-07T03:44:43+05:30 IST