ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాదర్స్‌ డేకి బంపర్ ఆఫర్ ప్రకటించిన RTC MD Sajjanar

ABN, First Publish Date - 2022-06-18T17:52:07+05:30

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. ఈ నెల 19న ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రులకు ఓ ఆఫర్ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌(RTC MD Sajjanar) మరో బంపర్‌ ఆఫర్(Bumper Offer) ప్రకటించారు. ఈ నెల 19న ఫాదర్స్‌ డే సందర్భంగా తండ్రులకు ఓ ఆఫర్ ప్రకటించారు. ఫాదర్స్‌ డే(Fathers Day) సందర్భంగా తండ్రులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల తల్లిదండ్రులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది. దీంతో ఐదేళ్లు, అంతకన్నా తక్కువ వయసున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆర్టీసీలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ప్రయాణించవచ్చు. టికెట్ లేకుండా వారంతా ఆర్టీసీ ఏసీ, నాన్‌ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.


అయితే ఈ సౌకర్యం ఒక్కరోజు మాత్రమే.. ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ అవకాశాన్ని ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా.. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సజ్జనార్‌.. ఆర్టీసీలో సంచలన మార్పులు చేశారు. ఇకపై బస్సు డ్రైవర్లు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే వారికి కూడా జరిమానా విధిస్తామని.. అలాగే బస్సులు సమయానికి రాకపోకలు సాగించేలా, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో పాటు మదర్స్‌, ఫాదర్స్‌ డే, చిల్డ్రన్స్‌ డే లాంటి ప్రత్యేకమైన రోజులను ఎంకరేజ్‌ చేస్తూ.. వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.


Updated Date - 2022-06-18T17:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising