secunderabad: రైలు ప్రయాణికుడిని కాపాడిన ఆర్పీఎఫ్ పోలీసులు
ABN, First Publish Date - 2022-10-17T16:55:04+05:30
కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు జారి కింద పడిపోతున్న ఓ ప్రయాణికుడిని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాస్
హైదరాబాద్/సికింద్రాబాద్: కదులుతున్న రైలు ఎక్కబోయి కాలు జారి కింద పడిపోతున్న ఓ ప్రయాణికుడిని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాస్ కాపాడాడు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ డెబస్మిత బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దాతే ఈనెల 16న మధ్యరాత్రి సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్‌ఫాం నెంబరు 1పై నుంచి ఢిల్లీ వెళ్లే దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతున్న సమయంలో ఎక్కబోయి అదుపుతప్పాడు. కాలు జారి రైలు కిందకు పడిపోతున్న అతన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ ఎస్‌ఐ శ్రీనివాస్ అప్రమత్తమై చేయి పట్టుకుని పైకి లాగి కాపాడాడు. అదేరోజు రాత్రి సికింద్రాబాద్ ప్లాట్‌ఫాం 1 నుంచి గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలు కదులుతుండగా ఓ మహిళా ప్రయాణికురాలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి కింద పడిపోతుండగా సమీపంలో ఉన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విశ్వజిత్‌ను ఆమెను కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ గాయాలపాలయ్యాడు. రైలు ప్రయాణికులను కాపాడడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఆర్పీఎఫ్ పోలీసులకు, సిబ్బందికి సెక్యూరిటీ కమిషనర్ కృతజ్ణతలు తెలిపారు.
Updated Date - 2022-10-17T16:55:04+05:30 IST