ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌తో తేజస్వీయాదవ్ భేటీ.. రెండు గంటల పాటు సాగిన చర్చలు

ABN, First Publish Date - 2022-01-12T00:12:39+05:30

సీఎం కేసీఆర్‌తో తేజస్వీయాదవ్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేవం సాగింది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌తో తేజస్వీయాదవ్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు వీరి సమావేశం సాగింది. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ఇరువురు చర్చించారు. రాబోయే రోజుల్లో బీజేపీ వ్యతిరేక శక్తులంతా ఏకమయ్యే క్రమంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అవకాశంపైనా కేసీఆర్‌, తేజస్వి చర్చించారు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అంశాన్ని కేసీఆర్‌కు తేజస్వీయాదవ్‌ వివరించారు. 


కాగా దేశంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ‌ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యే పనిలో ఉన్నాయి. ఈసారి ఎలాగైనా సరే బీజేపీ ప్రభుత్వాన్ని దించాలని ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో సహా బీజేపీయేతర పార్టీలన్నీ ఒక్కటిగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్ కలిశారని, తాజాగా బీహార్ ప్రతిపక్ష పార్టీ ఆర్‌జేడీ నేత తేజస్వీయాదవ్ కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 




Updated Date - 2022-01-12T00:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising