ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఆత్మహత్యలు సీఎంకు కనిపించడం లేదా?

ABN, First Publish Date - 2022-01-01T17:29:12+05:30

రాష్ట్రంలో మిర్చి పంటలకు వైరస్‌ సోకి పంట దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికి సీఎం కేసీఆర్‌ నోరు మెదపడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు సంపత్‌ కుటుంబాన్ని ఫోన్‌లో పరామర్శించిన రేవంత్‌రెడ్డి

 మహబూబాబాద్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో మిర్చి పంటలకు వైరస్‌ సోకి పంట దెబ్బతిని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికి సీఎం కేసీఆర్‌ నోరు మెదపడం లేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు తెలంగాణ సర్కార్‌కు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌ జిల్లా పర్వతగిరిలో యువ రైతు నారమళ్ల సంపత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌, జిల్లా నాయకులు వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు ద్వారా తెలుసుకున్నారు. శుక్రవారం పర్వతగిరికి కాంగ్రెస్‌ నేతలను పంపించిన రేవంత్‌రెడ్డి రైతు సంపత్‌ కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించి వారికి ధైర్యాన్ని చెప్పారు. వెంటనే వ్యవపాయాధికారులు, ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం సంపత్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ నేతలు రూ.10వేల సాయాన్ని అందించారు.

Updated Date - 2022-01-01T17:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising