ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అజయ్‌ని కమ్మకులస్తులు బహిష్కరించాలి: రేవంత్

ABN, First Publish Date - 2022-04-26T21:42:03+05:30

కమ్మ కులస్తులపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిన మంత్రి పువ్వాడ అజయ్‌ని కమ్మ కులస్తులు బహిష్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: కమ్మ కులస్తులపై కేసులు పెట్టి వేధింపులకు పాల్పడిన మంత్రి పువ్వాడ అజయ్‌ని కమ్మ కులస్తులు బహిష్కరించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రేవంత్ ఖమ్మంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ ప్రతిపక్ష పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అజయ్ సైకోలా వేధింపులకు పాల్పడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అజయ్ దుర్మార్గాలకు సాయిగణేష్ మృతి చెందాడన్నారు. నేడు పువ్వాడ అజయ్ తన సొంత కులాన్ని అడ్డం పెట్టుకుని తనపై కుట్ర జరుగుతుందనడం హస్యస్పందంగా ఉందన్నారు.అజయ్ ఉన్మాదిగా మారాడని  ఆక్షేపించారు. అజయ్ అక్రమాలపై, తన  మెడికల్ కళాశాలలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాను అన్న మాట ప్రకారం మమత మెడికల్ కళాశాలల్లో అక్రమాలను నిరూపిస్తా...... దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధంగా ఉండాలని అజయ్‌కి రేవంత్‌రెడ్డి సవాల్  విసిరారు. ప్రతిపక్ష నాయకులపై మంత్రి అజయ్‌ కేసులు పెట్టించి వేధిస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వరంగల్‌లో పెద్దఎత్తున రైతు సంఘర్షణ సభ

వరంగల్‌లో పెద్దఎత్తున రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఈ సభకు హాజరవుతున్నారని చెప్పారు. రైతులకు అండగా కాంగ్రెస్ నిలబడుతోందన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్‌దేనని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  

Updated Date - 2022-04-26T21:42:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising