ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy ఒక దొంగ: షర్మిల

ABN, First Publish Date - 2022-07-08T23:15:12+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy)పై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. లోటస్పాండ్లో వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘‘రేవంత్‌రెడ్డి ఒక దొంగ. ఒక మోసకారి. ఓటుకు నోటు కేసులో దొరికిన వారి వ్యాఖ్యలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్కు కేటాయించిన స్థలాన్ని సీఎం కేసీఆర్ వెనక్కు లాక్కున్నారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోతే తెలంగాణలో 400 మంది చనిపోయారు. ప్రస్తుత టీఆర్ఎస్ భవన్ను ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి కాదా?.. వైఎస్సార్ గౌరవార్థం హైదరాబాద్లో స్థలం కేటాయించాలని కోరుతున్నాం. ప్రస్తుతం టీఆర్ఎస్లోని సబితా ఇంద్రారెడ్డి, దానం నాగేందర్ను రాజకీయ నాయకులుగా చేసింది వైఎస్సార్ కాదా?.. వైఎస్సార్ను కాంగ్రెస్ అవమానించిన విషయం నిజం కాదా?.. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు కావాలని, వైఎస్సార్కు ఎలాంటి గౌరవం ఇవ్వలేదు. హైదరాబాద్ (Hyderabad)లో రాజశేఖర్రెడ్డికి ఎలాంటి గౌరవప్రదమైన ప్లేస్ లేదు’’ అని షర్మిల పేర్కొన్నారు. 


తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్  చేసింది ఏంలేదని షర్మిల దుయ్యబట్టారు. స్వయంకృతాపరాధాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ కూడా వైఎస్సార్కు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. 2004లో టీఆరెఎస్ బలం ఎంత? అని ప్రశ్నించారు. రాజశేఖర్రెడ్డి కేసీఆర్ను కలుపుకుంటేనే కదా.. హరీష్రావుకు మంత్రి పదవి వచ్చిందని షర్మిల గుర్తుచేశారు.

Updated Date - 2022-07-08T23:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising