ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: తెలంగాణ కాంగ్రెస్‌లో చల్లారని అసమ్మతి మంటలు

ABN, First Publish Date - 2022-08-14T20:43:38+05:30

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)లో అసమ్మతి మంటలు చల్లారలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) క్షమాపణలు చెప్పినా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)లో అసమ్మతి మంటలు చల్లారలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) క్షమాపణలు చెప్పినా ఎంపీ వెంకట్‌రెడ్డి బెట్టువీడక పోవడంపై  కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఇంట్లో మల్లు రవి, బెల్లయ్య నాయక్‌, చరుణ్‌ కౌశిక్‌ భేటీ అయ్యారు. క్షమాపణలు చెప్పినా కూడా దయాకర్‌ను టార్గెట్‌ చేయడంపై అసంతృప్తి చేస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. 


కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy venkat reddy)కి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (Addanki dayakar) మరోసారి క్షమాపణలు చెప్పారు. చండూరు సభలో తాను చేసిన వాఖ్యలకు భాదపడుతున్నట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓనత్యంతో తన తరుపున క్షమాపణ చెప్పారన్నారు. సోదర భావంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోసం పనిచేయాలని అద్దంకి దయాకర్ కోరారు. కాగా... కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్‌లో రేవంత్ క్షమాపణ వీడియోను పోస్ట్ చేశారు. చుండూరులో జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బహిరంగంగా తిట్టడంపై బాధ్యత వహిస్తూ ఎంపీకి రేవంత్ క్షమాపణ చెప్పారు.  ఇలాంటి భాష... ఎవరికీ మంచిది కాదని, దీనిని మరోసారి క్రమశిక్షణ కమిటీ పరిశీలించాలని చిన్నారెడ్డికి టీపీసీసీ చీఫ్ సూచించారు.

Updated Date - 2022-08-14T20:43:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising