ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

317 జీవో కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహం: రేవంత్ రెడ్డి

ABN, First Publish Date - 2022-01-10T03:05:53+05:30

కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇది ప్రాణాలు తీసే ప్రభుత్వమని, దానికి తాజా ఉదంతం బీంగల్ మండలం, బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య చేసుకోవడమేనన్నారు. అడ్డగోలు బదిలీతో మనస్థాపం చెంది సరస్వతి ఆత్మహత్య చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 317 జీవో విడుదలైన దగ్గర నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసిక ఒత్తిడితో గుండె ఆగో… బలవన్మరణానికి ఒడిగట్టో ప్రాణాలు వదులుతున్నారన్నారు. ఉద్యోగుల కేటాయింపు, బదిలీల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో ఉందని చెప్పారు. ఈ చావులకు ప్రభుత్వమే కాదు… వాళ్లకు వత్తాసు పలికే ఉద్యోగసంఘాలు కూడా బాధ్యులేనని తెలిపారు. 317 జీవో రద్దు కోసం ప్రభుత్వంపై పోరాడుదామని, ఉద్యోగులు మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు తీసుకోవద్దని రేవంత్ రెడ్డి సూచించారు

Updated Date - 2022-01-10T03:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising