తెలంగాణలో ఎనిమిదేళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్: రేవంత్
ABN, First Publish Date - 2022-04-16T17:14:08+05:30
తెలంగాణలో 8 ఏళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్ యథేచ్చగా నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణలో 8 ఏళ్లుగా కేసీఆర్ బియ్యం స్కామ్ యథేచ్చగా నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. వానాకాలం పంటలో నిజామాబాద్‌లోనే లక్ష క్వింటాళ్లు స్కామ్ చేశారంటే.. రాష్ట్రం మొత్తంలో స్కామ్ ఏ స్థాయిలో ఉంటుందోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు తెలియకుండా ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా బీజేపీని ఆపుతున్నదెవరని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
Updated Date - 2022-04-16T17:14:08+05:30 IST