ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో జూనియర్ కాలేజీలుగా 86 గురుకులాలు

ABN, First Publish Date - 2022-07-01T22:39:28+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు  తెలంగాణలోని 86 గురుకుల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివిధ వెల్పేర్ డిపార్ట్ మెంట్ ల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా వాటిని తీరు తెన్నులు ఎలా ఉండాలన్నదానిపైనా, మార్గదర్శకాల రూపకల్పనపై చర్చించారు. అనంతరం సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిళ్లను జిల్లాకొకటి శాశ్వతంగా ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించి కూడా ఒక నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించినట్టు తెలిపారు. 


నివేదికలు సిద్ధం అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగే సమావేశంలో వీటిపై చర్చించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణంలో కిచెన్ లు ఉండాలని, వంటవాళ్లకు కూడా సరైన ట్రయినింగ్ ఇచ్చేలా మార్గదర్శకాలను రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో బిసి వెల్ఫేర్ డిపార్ట్ మెట్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం, పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జ, మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్ స్టిట్యూషన్స్ కార్యదర్శి మల్లయ్యభట్టుతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T22:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising