ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనాభా ప్రాతిపదికన గిరిజనులకు రిజర్వేషన్లు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ABN, First Publish Date - 2022-04-28T21:32:01+05:30

తెలంగాణలోని గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలోని గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాల్సి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. అందుకు తగిన విధముగా 12 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిందన్నారు. తెలంగాణలో ఏడు సంవత్సరాలుగా విద్య , ఉద్యోగాల్లో గిరిజనులు అణిచివేతకి గురవుతున్నారని ఆయన అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు తెచ్చి పోడు భూములకు హక్కులు కల్పించిందన్నారు.


రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని, రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల గిరిజనులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల జీవితాలతో చెలగాటం అడకుండా గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని మార్చి కనీసం 10 శాతం అయిన తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాస్తున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటనపై ఆయన స్పందించారు. టీపీసీసీ అధ్యక్షుడు అన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్తారని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2022-04-28T21:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising