ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదగిరిగుట్టలో బాలాలయం తొలగింపు

ABN, First Publish Date - 2022-04-16T09:18:23+05:30

యాదగిరికొండపైన ఆరేళ్లుగా సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులు కొలువుదీరిన బాలాలయాన్ని వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) అధికారులు తొలగిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ స్థానంలో ధార్మిక సాహిత్య సంగీత కళావేదిక ?

యాదాద్రి, ఏప్రిల్‌ 15 (ఆంధ్ర‌జ్యోతి): యాదగిరికొండపైన ఆరేళ్లుగా సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులు కొలువుదీరిన బాలాలయాన్ని వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ) అధికారులు తొలగిస్తున్నారు. మార్చి 28న జరిగిన ఉద్ఘాటన అనంతరం ప్రధానాలయం గర్భాలయంలో ఉన్న నృసింహుని దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు. దీంతో బాలాలయం తొలగింపునకు అధికారులు సిద్ధమయ్యారు. రెండు లేదా మూడురోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. బాలాలయాన్ని తొలగించాలా? వద్దా? తొలగిస్తే ఆ ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు ఉండాలనే అంశంపై అధికారులు ఇప్పటికే సమీక్షించారు. బాలాలయం స్థానంలో ధార్మిక సంగీత మహాసభల నిర్వహణకు ఓ కళావేదిక నిర్మించనున్నారని సమాచారం. దాంతోపాటు అర్చకుల విశ్రాంతి గృహాన్ని కూడా నిర్మించే అవకాశముంది. 


ఆరేళ్లపాటు భక్తుల పూజలు..

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు 2014లో సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ మేరకు వైటీడీఏ ఏర్పాటుచేసి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ప్రధానాలయాన్ని విస్తరించేందుకు చుట్టుపక్కన కట్టడాలు తొలగించాల్సి ఉన్నందున భక్తుల దర్శనాల కోసం తాత్కాలిక బాలాలయాన్ని నిర్మించాలని శ్రీవైష్ణవ పీఠాధిపతి చినజీయర్‌స్వామి సూచించారు. దీంతో ప్రధానాలయానికి ఉత్తర దిశలో సువిశాలమైన ప్రాంగణంలో బాలాలయాన్ని నిర్మించారు. 

Updated Date - 2022-04-16T09:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising