12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్దరణ
ABN, First Publish Date - 2022-07-21T10:22:18+05:30
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జూలై 20(ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 12 డైలీ ప్యాసింజర్ రైళ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్టు రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జూలై22 నుంచి కాచిగూడ-నిజామాబాద్ రైలు(07596), నిజామాబాద్-కాచిగూడ రైలు (07593), జూలై 25 నుంచి సికింద్రాబాద్-వరంగల్ రైలు (07462), వరంగల్-హైదరాబాద్ రైలు (07463), విజయవాడ-భద్రాచలం రైలు (07979), భద్రాచలం-విజయవాడ రైలు (07278, నిజామాబాద్-కరీంనగర్ రైలు (07893), కరీంనగర్-నిజామాబాద్ రైలు(07894), కరీంనగర్-సిర్పూర్ టౌన్ రైలు (07765), సిర్పూర్‌టౌన్- కరీంనగర్ రైలు (07766)ను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే సికింద్రాబాద్-వికారాబాద్ రైలు (07591), వికారాబాద్- కాచిగూడ రైలు (07592)ను పునరుద్ధరించినట్టు తెలిపారు.
Updated Date - 2022-07-21T10:22:18+05:30 IST