ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్వోల సర్దుబాటుపై స్టేకు నిరాకరణ

ABN, First Publish Date - 2022-08-04T09:56:55+05:30

వీఆర్వోలను ఇతర శాఖలకు తరలిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో భవితవ్యం తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుది తీర్పునకు లోబడే జీవో భవితవ్యం: హైకోర్టు 

హైదరాబాద్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వీఆర్వోలను ఇతర శాఖలకు తరలిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో భవితవ్యం తమ తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. వీఆర్వోలను ఇతర శాఖల్లోకి బదలాయించి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 23న జీవో నెంబర్‌ 121ని జారీచేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ పలువురు వీఆర్వోలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ పి. మాధవీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ఎటువంటి మార్గదర్శకాలు లేకుండా వీఆర్వోలను ఇతర శాఖలకు తరలించడం చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన జీవోలో వీఆర్వోల సర్వీసుకు, సీనియార్టీకి, రాజీనామా, రిటైర్‌మెంట్‌కు సంబంధించి ఎటువంటి గ్యారెంటీ కల్పించలేదని తెలిపారు. ఇతర శాఖలకు బదలాయించే ముందు ఎటువంటి ఆప్షన్లు స్వీకరించలేదని తెలిపారు. సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియను కొట్టేయాలని కోరారు. జీవోపై స్టే విధించాలని కోరా రు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. జీవోకు సం బంధించిన తదుపరి చర్యలపై ఎటువంటి స్టే ఇవ్వలేదు. జీవో భవితవ్యం తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. విచారణను వచ్చేనెలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-08-04T09:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising