ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ కార్డులు ఎప్పుడో?

ABN, First Publish Date - 2022-12-26T00:14:47+05:30

ఆహారభద్రత కొత్త కార్డుల కోసం పేదలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారికి ఎటువం టి ఆహారభద్రత కార్డులు లేవు. వారు అర్హులైనప్పటికీ ఏళ్లుగా వారికి రేషన్‌ కార్డులు మంజూరు కావడం లేదు. ఇక కార్డులో పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం కొత్త కార్డులు రావడం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో 14వేల మంది దరఖాస్తు

పేరు మార్పునకు 20,556మంది దరఖాస్తు చేసినా రాని కార్డులు

తొలగింపులు మాత్రం క్షణాల్లో

సూర్యాపేటటౌన్‌: ఆహారభద్రత కొత్త కార్డుల కోసం పేదలు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిన వారికి ఎటువం టి ఆహారభద్రత కార్డులు లేవు. వారు అర్హులైనప్పటికీ ఏళ్లుగా వారికి రేషన్‌ కార్డులు మంజూరు కావడం లేదు. ఇక కార్డులో పేరు మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సైతం కొత్త కార్డులు రావడం లేదు. 2017 జూన్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆహారభద్రత కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో జిల్లాలో వేలాది మంది నిరుపేదలు రేషన్‌ సరుకులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో దరఖాస్తులు చేసుకున్న వారిలో కొంత మందికి ఈ ఏడాది కొత్త కార్డులు మం జూరు చేశారు. ఐదేళ్ల క్రితం జన్మించిన పిల్లల పేర్లు ఈ కార్డుల్లో నమో దు కాలేదు. దీంతో నిరుపేదలకు పూర్తిస్థాయిలో రేషన్‌ అందడం లేదు.

జిల్లాలో 2017 తర్వాత నూతన కార్డుల కోసం 14వేల మంది వరకు పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే రేషన్‌కార్డులు ఉండి అందులో వారి కుటుంబ సభ్యుల పేరు కొత్తగా నమోదు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 20,556 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను తహసీలా ్దర్లు విచారించి అర్హుల జాబితాను సిద్ధంచేశారు. వీరికి నేటికీ కొత్త కార్డులు మంజూరు కాలేదు. కాగా, ఎనిమిది నెలల క్రితం 2017లోపు దరఖాస్తు చేసుకున్న సుమారు 20వేల మందికి మాత్రం నూతన కార్డులు పంపిణీ చేశారు. జిల్లాలో చాలా మంది ఇతర పనుల నిమిత్తం వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. జిల్లా కేంద్రంతో పాటు సమీపంలో ని పలు గ్రామాల ప్రజలు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు కూలీ పనుల నిమిత్తం వెళ్లారు. తాపీ మేస్త్రీ, సెక్యూరిటీ గార్డులు, కూలీలుగా హైదారబాద్‌లో జిల్లా వాసులు చాలా మంది పనిచేస్తున్నారు. వీరిలో చాలామందికి రేషన్‌ కార్డులు లేవు. వీరు తిరిగి స్వగ్రామాలకు చేరాక నూతన రేషన్‌ కార్డు ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభు త్వ గడువు మేరకు వీరు దరఖాస్తు చేసుకోకపోవడంతో నేటికీ కొత్త కార్డులు రాలేదు. ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత బియ్యం నిరుపేదలకు ఆసరాగా ఉంటాయి. అయితే రేషన్‌ కార్డు లేకపోవడం తో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్‌ కార్డులో కొత్తగా కుటుంబ సభ్యులు పేరు నమోదు కు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ప్రభుత్వం నూతన కార్డులు మంజూరు చేయలేదు. దీంతో కుటుంబ సభ్యుల సంఖ్య మేరకు పూర్తిస్థాయిలో ఉచిత బియ్యం అంద డం లేదు. నిరుపేదల అవస్థలను గుర్తించి దరఖాస్తు చేసుకొని ఆమోదం పొందిన అర్హులకు ప్రభుత్వం బియ్యం కోటా మంజూరు చేయలని ప్రజలు కోరుతున్నారు.

3.15లక్షల కార్డులు

జిల్లాలో మొత్తం 609 రేషన్‌ దుకాణాలు ఉన్నా యి. 3,15,180 రేషన్‌కార్డులు ఉన్నాయి. అందులో 2,96,359 ఆహారభద్రత కార్డులు కాగా, 18,773 అంత్యోదయ కార్డులు, 48 అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రభుత్వం నెలకు 59,527.79 క్విం టాళ్ల బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరుచేస్తే లబ్ధిదారుల సంఖ్య మరిం త పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, నూతనంగా వివాహామైన ఆడపిల్లల పేర్లను వెంటనే రేషన్‌కార్డులో నుంచి తొలగిస్తున్నారు. అదే సమయంలో భర్త ఇంటి పేరుతో ఉన్న రేషన్‌కార్డులో మాత్రం వారి పేరును తిరిగి నమోదు చేయడం లేదు. అందుకు దరఖాస్తు చేసుకున్నా ఏళ్ల తరబడి కార్డు రావడం లేదు. దీంతో వారి కోటా రేషన్‌ సదరు కుటుంబానికి మంజూరవడం లేదు.

పేరు మార్పుకు దరఖాస్తు చేసుకున్నా : రూప, సూర్యాపేట

నా పెళ్లి కాగానే మా తల్లిదండ్రుల రేషన్‌కార్డులో నా పేరును తొలగించారు. భర్త రేషన్‌కార్డులో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా నేటికీ కార్డు రాలేదు. పేరు తొలగింపు వెంటనే చేశారు గానీ, నమోదుకు మాత్రం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఐదేళ్ల క్రితం పుట్టిన పిల్లల పేర్లు కూడా నేటికీ రేషన్‌ కార్డులో నమోదు కాలేదు.

ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు : పుల్లయ్య, ఇన్‌చార్జి డీఎ్‌సవో

ప్రభుత్వం నుంచి నూతన కార్డులకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలని చాలా దరఖాస్తులు వచ్చా యి. అన్నింటినీ పరిశీలించి మార్పులు, చేర్పులు చేసి నూతన రేషన్‌ కార్డులు అందజేస్తాం.

Updated Date - 2022-12-26T00:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising