ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్స్‌ఫ్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని ఎత్తివేయాలి

ABN, First Publish Date - 2022-12-07T23:22:23+05:30

ధ్వని, వాయు కాలుష్యాలతో జీవనానికి ఆటంకంగా మారిన కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని శాశ్వతంగా తరలించాలని పరిసర గ్రామాల, తండాల ప్రజలు కదం తొక్కారు.

ఎక్స్‌ఫ్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ ఎదుట ధర్నా చేస్తున్న ప్రజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్మాస్‌పల్లి సమీపంలోని కంపెనీ ఎదుట ధర్నా

తరలివచ్చిన 15 గ్రామాలు, తండాల ప్రజలు

కడ్తాల్‌, డిసెంబరు 7: ధ్వని, వాయు కాలుష్యాలతో జీవనానికి ఆటంకంగా మారిన కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని శాశ్వతంగా తరలించాలని పరిసర గ్రామాల, తండాల ప్రజలు కదం తొక్కారు. బుధవారం అన్మా్‌సపల్లి, కడ్తాల, సాయిరెడ్డిగూడ, జమ్ములబావి తండా, పుల్లేరుబోడుతండా, పోచమ్మగడ్డ తండా, కానుగుబావి తండా, గాన్గుమర్ల తండా, ఎక్వాయిపల్లి, ముద్విన్‌, ముచ్చర్ల గ్రామాలకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు ఫ్యాక్టరీ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ నుంచి వెలువడుతున్న పేలుళ్లకు ఇళ్లు బీటలు బారుతున్నాయని, బోరుబావులు దెబ్బతింటున్నాయని, వాయు కాలుష్యం కారణంగా వృద్ధులు, పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులు మనుగడ కోల్పోతున్నాయని, కంపెనీకి భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రోడ్డు దెబ్బతింటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని శాశ్వతంగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌, ఎంపీడీవో రామకృష్ణలను కలిసి ఫ్యాక్టరీని ఎత్తివేయాలని వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కడ్తాల జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అద్యక్షుడు కంబాల పరమేశ్‌, అన్యా్‌సపల్లి సర్పంచ్‌ శంకర్‌, ముద్విన్‌ సర్పంచ్‌ యాదయ్య, కడ్తాల మండల రైతు బందు సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising