ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయ హక్కుల సాధనకు కృషి

ABN, First Publish Date - 2022-12-15T23:57:33+05:30

శాసన మండలిలో ఉపాధ్యాయ హక్కులపై వాణి వినిపించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని బహుజన సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ ఎస్‌.విజయ్‌కుమార్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, డిసెంబరు 15: శాసన మండలిలో ఉపాధ్యాయ హక్కులపై వాణి వినిపించేందుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని బహుజన సంఘాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ ఎస్‌.విజయ్‌కుమార్‌ కోరారు. గురువారం పరిగి పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, 317 జీవోతో ఉపాధ్యాయ భార్యభర్తల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి, క్రిమీలేయర్‌ విధానాన్ని రద్దు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా ఉపాధ్యాయులు, స్వీపర్లు, వాచ్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయాలని, అందుకోసం పోరాటం చేస్తానన్నారు. ఓటర్లు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అఽధ్యక్షుడు కె.రామకృష్ణ తదితరులున్నారు.

Updated Date - 2022-12-15T23:57:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising