ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాపరాతి అక్రమ తవ్వకాలపై కొరడా

ABN, First Publish Date - 2022-11-30T00:19:44+05:30

నాపరాతి అక్రమ తవ్వకాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. తాండూరు మండల పరిధిలోని సంగెంకలాన్‌, కోటబాస్పల్లి, మల్కాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంత్రాలను సీజ్‌ చేసిన రెవెన్యూ అధికారులు

తాండూరు రూరల్‌, నవంబరు, 29 : నాపరాతి అక్రమ తవ్వకాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. తాండూరు మండల పరిధిలోని సంగెంకలాన్‌, కోటబాస్పల్లి, మల్కాపూర్‌ గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుని గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న తాండూరు తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు మంగళవారం సిబ్బందిని తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఆర్‌ఐ రాజిరెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా మల్కాపూర్‌ సహకార సంఘం సొసైటీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా తవ్వకాలు జరపుతుండటంతో పనులు నిలిపివేసి యంత్రాలను సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న తవ్వకాలను నిలిపేసి యంత్రాలను అక్కడి నుంచి తరలించినట్లు చెప్పారు.

Updated Date - 2022-11-30T00:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising