ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతాం

ABN, First Publish Date - 2022-12-15T00:11:53+05:30

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వ్యూహకర్త(స్ర్టాటజి్‌స్ట)సునీల్‌ కార్యాలయంపై పోలీసులు దాడిని నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేశారు.

షాద్‌నగర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షాద్‌నగర్‌ అర్బన్‌/కడ్తాల్‌/ఇబ్రహీంపట్నం/కేశంపేట, /కొత్తూరు/కొందుర్గు/కందుకూరు/శంషాబాద్‌,డిసెంబరు 14: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా వ్యూహకర్త(స్ర్టాటజి్‌స్ట)సునీల్‌ కార్యాలయంపై పోలీసులు దాడిని నిరసిస్తూ బుధవారం నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో కాంగ్రెస్‌ నాయకులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని వదిలి దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకోకుంటే కాంగ్రెస్‌ పార్టీ ఆయనకు తగిన బుద్ధి చెబుతుందని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. షాద్‌నగర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేసి బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ సభ్యుడు బాబర్‌ఖాన్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ప్రజాదరణతో కేసీఆర్‌కు భయంపట్టుకుందన్నారు. నిరసనలో నాయకులు బాల్‌రాజ్‌గౌడ్‌, రఘునాయక్‌, కె.పురుషోత్తంరెడ్డి, శ్రీశైలం, మోహన్‌, ఖదీర్‌, అశోక్‌, శేఖర్‌, అనంతయ్య, సాయులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త సునిల్‌ కార్యాలయంపై పోలీసులు దాడిచేసి వార్‌ రూమ్‌లోని డేటాను ధ్వంసం చేయడం అరాచకం అని కడ్తాల కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి ఆధ్వర్యంలో డెయిరీ వద్ద హైదరాబాద్‌-శ్రీశైలంహైవేపై రాస్తారోకో చేసి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ నియంత పాలన చేస్తున్నారని శ్రీనివా్‌సరెడ్డి మండిపడ్డారు. నాయకులు జహంగీర్‌బాబ, లక్ష్మయ్య, రాంచందర్‌, మల్లయ్య, శ్రీను, శ్రీరాములు, తిరుపతిరెడ్డి, వెంకటేశ్‌, రమేశ్‌గౌడ్‌, షబ్బీర్‌, షాబుద్దీన్‌, భానుకిరణ్‌, రాజేశ్‌, ఇమ్రాన్‌బాబ, రాజేందర్‌,వంశీ, భరత్‌, తులసీరామ్‌, గోపి, రమేశ్‌, చెన్నయ్య పాల్గొన్నారు. తలకొండపల్లిలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, రాము లు, అజీం, రవీందర్‌, డేవిడ్‌, చెన్నకేశవులు, ఆరిఫ్‌, రమేశ్‌, శివ, యా దగిరి, విష్ణు, సాయినాథ్‌ పాల్గొన్నారు. ఆమనగల్లులో విలేఖరులతో యువజన కాంగ్రెస్‌ జిల్లా కార్యదర్శి కృష్ణనాయక్‌ మాట్లాడారు. ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు ఇబ్రహీంపట్నంలో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌ఎ్‌సయూఐ నియోజకవర్గ అధ్యక్షుడు నందకిషోర్‌, విప్లవ్‌, ప్రభాస్‌, సుమంత్‌, శివగౌడ్‌, రాకేష్‌ పాల్గొన్నారు. కేశంపేటలో కాంగ్రెస్‌ శ్రేణులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశాయి. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వీరేష్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు అనసూయమ్మ, కిసాన్‌సెల్‌ రాములు, నర్సింలు,శంకర్‌, రాములు, దర్శన్‌, లింగం, రమేష్‌, పెంటయ్య పాల్గొన్నారు. కొత్తూరు, కొం దుర్గు, మండలాల్లోనూ కేసీఆర్‌ దిష్టిబొమ్మలను కాంగ్రెస్‌ నాయకులు దహనం చేశారు. కందుకూరులో ఎన్‌ఎ్‌సయూఐ నేతలు హైదరా బాద్‌-శ్రీశైలం రహదారిపై ర్యాలీ నిర్వహించి కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల నాయకుడు ఎ.ప్రభాకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి వినోద్‌చారి పాల్గొన్నారు. నహీమ్‌, అసాద్‌, శివాజీ, అంజద్‌, కుమార్‌, రాజు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ వార్‌రూంపై పోలీసుల దాడి అమానుషమని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వేణుగౌడ్‌ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో శంషాబా ద్‌లో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో శంషుద్దీన్‌, నందరాజ్‌గౌడ్‌, దయానంద్‌, వీరే్‌ష,గౌడ్‌, జక్కు, ఇలియాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising