గ్రామాల అభివృద్ధికి పాటుపడతాం
ABN, First Publish Date - 2022-12-15T23:44:50+05:30
గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు జడ్పీటీసీ బొ క్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్ సురేందర్‌రెడ్డిలు అన్నారు.
కందుకూరు, డిసెంబరు 15: గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు జడ్పీటీసీ బొ క్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి, మహేశ్వరం మార్కెట్ కమిటి చైర్మన్ ఎస్ సురేందర్‌రెడ్డిలు అన్నారు. ఊడ్పీ నిధుల నుండి మండలంలోని బాచుపల్లి గ్రామంలో నిర్మించనున్న భూగర్భ డ్రైనేజి పనులకు రూ.5లక్షలు, గుమ్మడవె ళ్లి గ్రామంలో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నిధుల నుండి మంజూరైన రూ.90లక్షల నిధులతో గురువారం పీఏసీఎస్ చైర్మన్ డి.చంద్రశేఖర్తఓ కలిసి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండల పరిదిలోని 35 గ్రామ పంచాయతీలలో ధశల వారిగా అభివృద్ధి చేపడు తున్నట్లు అన్నారు. ఈ కార్యక్రమంలో బాచుపల్లి, గుమ్మడవెళ్లి గ్రామాల సర్పంచ్‌లు యాలాల శ్రీనివాస్, గౌర ప్రభాకర్, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఎంపీటీ సీలు సురేష్, రేఖ, నాయకులు మన్నె జయేందర్‌ముదిరాజ్, బి.క్రిష్ణరాంభూపాల్‌రెడ్డి, తాళ్ల కార్తీక్, బి.దీక్షీత్‌రెడ్డి, దేవ్లానాయక్, ఏ.వెంకటే్‌షగౌడ్, మల్లేష్, కిరణ్, మల్లే్‌షయాదవ్, శేఖర్‌గుప్తా, సుదీర్‌కుమార్, ఎం.శ్రీశైలం పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:44:51+05:30 IST