ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ భూముల కబ్జాను నిరోధిస్తాం

ABN, First Publish Date - 2022-09-29T05:27:31+05:30

అటవీ భూముల కబ్జాను నిరోధిస్తాం

మాట్లాడుతున్న డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కలప అక్రమ రవాణా అరికట్టేందుకు పెట్రోలింగ్‌ : డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రెడ్డి 

తాండూరు రూరల్‌, సెప్టెంబరు 28: వికారాబాద్‌ జిల్లాలో అటవీ భూములను కబ్జాల నుంచి విముక్తి చేసేందుకు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తాండూరు అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 47వేల హెక్టార్లలో అటవీ భూములున్నాయని, వీటిలో ఇప్పటి వరకు 11వేల ఎకరాలు కబ్జాకు గురైనట్లు తమ రికార్డుల్లో చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మైల్వార్‌ క్లస్టర్‌లో పర్యటించినట్లు తెలిపారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని మైల్వార్‌ అటవీ శివారులో 1100 హెక్టార్లలో అటవీ భూమి ఉందని, అందులో నుంచి 300 నుంచి 400 ఎకరాల వరకు కబ్జాకు గరైనట్లు పేర్కొన్నారు. కర్ణాటక శివారు ఉన్నందున ఇరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించి చర్యలు చేపట్టాల్సి వస్తుందన్నారు. చింతామణిపట్నం శివారులో సర్వేనెంబర్‌-47, 50లో కొంత అటవీ భూమిని అప్పట్లో రైతులు కబా చేసినట్లు రికార్డులు ఉన్నాయన్నారు. అదేవిధంగా రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో  కబ్జాకు గురైన అటవీ శాఖ భూమిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పోడు భూముల కింద 23వేల ఎకరాల కోసం దరఖాస్తులు అందాయని,  విచారణ జరుపుతున్నామన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 13శాతం  అడవులు ఉన్నాయని తెలిపారు. అటవీ భూముల్లో అక్రమ కలప తరలించకుండా రాత్రివేళల్లో సిబ్బంది ద్వారా గస్తీ ముమ్మరం చేయడం జరుగుతుందన్నారు. అంతారం గ్రామ శివారులో రూ.1.50 కోట్లతో పార్కు నిర్మాణం చేపట్టామన్నారు. సమావేశంలో తాండూరు అటవీరేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌రావు ఉన్నారు.

Updated Date - 2022-09-29T05:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising