ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లింగ వివక్ష లేని సమాజం కోసం పాటుపడాలి

ABN, First Publish Date - 2022-12-16T23:25:20+05:30

లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, డిసెంబరు 16: లింగ వివక్ష లేని సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం చైల్డ్‌లైన్‌ 109, ఏహెచ్‌టీయూ ఆధ్వర్యంలో మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల శివారెడ్డిపేటలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షలుతప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్‌ చాటింగ్‌ల కారణంగా బాలలు మానసిక రుగ్మతలకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. పిల్లలకు మొబైల్‌ ఫోన్లు ఇవ్వకపోవడం మంచిందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ శ్రీను, ప్రిన్సిపాల్‌ అనూష, చైల్డ్‌లైన్‌ కౌన్సిలర్‌ రామేశ్వర్‌, ఏహెచ్‌టీయూ అలీమోద్దీన్‌, రవీందర్‌, షీ టీం ఇన్‌చార్జి శీనయ్య, టీచర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising